మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!

మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!

Published on Jul 30, 2025 7:03 AM IST

war2-telugu

ప్రస్తుతం బాలీవుడ్ సహా టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే భారీ యాక్షన్ చిత్రం “వార్ 2” అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కావాలి అంటే ఈ వెర్షన్ లో చూడాల్సిందే అని దర్శకుడు అంటున్నాడు.

వార్ 2 ఇండియన్ సినిమా నుంచి మొదటి డాల్బీ వెర్షన్ సినిమాగా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా దర్శకుడు కూడా తమ సినిమా ది బెస్ట్ సౌండ్ విషయంలో కానీ విజువల్స్ పరంగా కానీ డాల్బీ వెర్షన్ లో చూడమని చెబుతున్నారు. వార్ 2 మంచి ట్రీట్ ఇస్తుందని తెలుపుతున్నారు. మరి ఇలా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు