‘ఆటో జానీ’లో విజయ్ సేతుపతి? మక్కల్ సెల్వన్ కామెంట్స్!

‘ఆటో జానీ’లో విజయ్ సేతుపతి? మక్కల్ సెల్వన్ కామెంట్స్!

Published on Jul 30, 2025 8:05 AM IST

మన టాలీవుడ్ మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవితో మంచి మాస్ చిత్రం “ఆటో జానీ” చేస్తున్న వార్తలు అప్పట్లో ఎలా సెన్సేషన్ సెట్ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఇది పలు కారణాలు చేత కార్యరూపం దాల్చలేదు. కానీ ఎట్టకేలకి ఈ సినిమా చిరుతో కాకుండా తమిళ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో తాను చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో సినిమా మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఆటో జానీయే అనే ప్రశ్నకి విజయ్ సేతుపతి సమాధానం ఇచ్చారు. కథ అవీ ముందే ఎలా చెప్పేస్తానని? కానీ సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది అని తాను తెలిపారు. ఇక్కడ సబ్జెక్టు అది కాదు అని మాత్రం సేతుపతి చెప్పడం లేదు. దీనితో ఈ రూమర్స్ నిజమేనా అని చాలా మంది అనుకుంటున్నారు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు