‘విశ్వంభర’లో ఆమె కూడా మెయిన్ హీరోయినే అట

‘విశ్వంభర’లో ఆమె కూడా మెయిన్ హీరోయినే అట

Published on Jul 30, 2025 1:58 AM IST

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రస్తుత చిత్రాల్లో ఎప్పుడు నుంచో రిలీజ్ కోసం చూస్తున్న ప్రాజెక్ట్ మాత్రం “విశ్వంభర” అని చెప్పాలి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ ఫాంటసీ వండర్ విడుదల అంతకంతకు వెనక్కి వెళుతుంది. కానీ ఈ గ్యాప్ లో దర్శకుడు మాత్రం పలు ఇంటర్వ్యూస్ లో మరిన్ని ఆసక్తికర డీటెయిల్స్ ని అందిస్తున్నాడు.

ఇలా సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ బయటకి వచ్చింది. ‘విశ్వంభర’లో ఆల్రెడీ చాలామంది హీరోయిన్స్ ఉన్నారని అందరికీ తెలిసిందే. త్రిష, ఆషిక రంగనాథ్, సురభి పురాణిక్ ఇంకా కొందరు ఉన్నారు. అయితే వీరితో మెయిన్ లీడ్ హీరోయిన్ గా త్రిష అనే చాలా మంది అనుకున్నారు.

మిగతా వారు కీలక పాత్రలు అని టాక్ ఉంది. కానీ త్రిషతో పాటుగా ఆషిక రంగనాథ్ కూడా మరో మెయిన్ హీరోయిన్ అని వశిష్ఠ రివీల్ చేశారు. సో ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఈ ఇద్దరూ కనిపించనున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు