టాలీవుడ్ లో ప్రస్తుతం ‘బీ ద రియల్ మెన్’ ఛాలెంజ్ హడావుడే ఎక్కువుగా ఉంది. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు రాజమౌళి కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం.. చిరంజీవి ఇప్పటికే ఛాలెంజ్ ను అంగీకరించడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో పాటు బాలయ్యకు కూడా ఎన్టీఆర్ ఛాలెంజ్ విసిరారు. మరి బాలయ్య ఛాలెంజ్ ను అంగీకరిస్తారా లేదా అని ఫ్యాన్స్ ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నారు.
అయితే బాలయ్య బాబు ఇంకా సోషల్ మీడియాకి దూరంగానే ఉంటున్నారు. తోటి హీరోలంతా చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికపుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తున్నారు. బాలయ్య కూడా ఈ ఛాలెంజ్ తో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలని ‘బాలయ్య ఫ్యాన్స్’ ఆశ పడుతున్నారు.
మరి ఇక నుండైనా బాలయ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయితే బాగానే ఉంటుంది. ఇంతకీ ఎన్టీఆర్ ఛాలెంజ్ కి బాలయ్య రియాక్షన్ ఏమిటో చూడాలి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.