కొత్త లుక్ తో ఆశ్చర్యపరిచిన అఖిల్ !

కొత్త లుక్ తో ఆశ్చర్యపరిచిన అఖిల్ !

Published on Aug 24, 2020 9:04 PM IST

అక్కినేని అఖిల్ కొత్త మేక్ ఓవర్ తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పర్ఫెక్ట్ బాడీతో యాక్షన్ హీరో లుక్ లో కనిపిస్తోన్న అఖిల్, తన కొత్త చిత్రం కోసం.. ఈ కొత్త లుక్ లోకి మారినట్టు తెలుస్తోంది. అఖిల్ తదుపరి యాక్షన్ జానర్‌ లో కూడా ఒక చిత్రం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా కూడా కరోనా అనంతరం రిలీజ్ కి రెడీగా ఉంది.

కాగా అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

తాజా వార్తలు