మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ టీజర్ మరియు టైటిల్ ప్రకటన కూడా నిన్న మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల అయ్యాయి. ఇదిలా ఉండగా చిరు ఈ భారీ ప్రాజెక్ట్ తో పాటు మరిన్ని సినిమాలు కూడా తన లైనప్ లో పెట్టుకున్నారు. వాటిలో “లూసిఫర్” మరియు “వేదాళం” రీమేక్స్ కూడా ఒకటి.
అయితే వీటిలో ఒక చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా నిన్న చిరు పుట్టినరోజు సందర్భంగా రావాల్సి ఉంది అని అంతకుముందు గట్టి బజ్ వినిపించింది. కానీ ఊహించని విధంగా ఆచార్య ఒక్క చిత్రం నుంచి మాత్రమే అప్డేట్ వచ్చింది. దీనితో ఇప్పుడు చిరు ఎందుకు మిగతా వాటిని స్కిప్ చేసారా అని టాక్ వస్తుంది. అయితే దీనికి చిరునే వద్దన్నారని తెలుస్తుంది. అప్పుడే అన్ని అప్డేట్స్ ఒకేసారి కాకుండా ఒక్కొక్కసారి ఇవ్వాలని అనుకుంటున్నారట అందుకే అప్పుడు ప్రకటించలేదని టాక్ వినిపిస్తుంది.