తారక్ తో త్రివిక్రమ్ ప్లాన్ ఇలా ఉండాల్సిందేనా.?

తారక్ తో త్రివిక్రమ్ ప్లాన్ ఇలా ఉండాల్సిందేనా.?

Published on Feb 13, 2021 7:02 AM IST

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీని తర్వాత తారక్ స్టార్డం కూడా మరో స్థాయికి వెళ్లడం కూడా గ్యారంటీ అని భీం టీజర్ చూస్తే అర్ధం అయ్యింది.

అయితే మరి దీనితో పాటుగా తారక్ మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తో ఉంది. మరి ఈ రెండు ప్రాజెక్ట్ లు కూడా పాన్ ఇండియన్ లెవెల్ లోవే. అయితే ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ పై తుది క్లారిటీ ఇటీవలే రావడంతో తారక్ మరియు త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా కోసమే హైలైట్ అవుతుంది.

ఎందుకంటే త్రివిక్రమ్ ఎప్పుడో ఎంచుకున్న నేపథ్యం ఇది. కానీ ఇప్పుడు తారక్ స్టార్డం పాన్ ఇండియన్ లెవెల్ లోకి మారింది. మరి అందుకు తగ్గట్టుగా RRR మరియు ప్రశాంత్ నీల్ తో చేసే వాటికి మ్యాచ్ చేసేదిలా ఈ ప్రాజెక్ట్ ఉండాలి తప్పితే తగ్గకుండా ఉండాలి. మరి తారక్ కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ఎలా ప్లాన్ చేస్తారో చెయ్యబోతున్నారో వాటికి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు