‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్

‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్

Published on Jul 29, 2025 2:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమే “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న భారీ చిత్రం టీజర్ తర్వాత మాత్రం మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది. మరి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా పవర్ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

టీజర్ లో తనపై విజువల్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇక నేడు సంజయ్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని విడుదల చేశారు. మరి ఇందులో సంజయ్ సంజు బాబాగా ఒక వయసు మళ్ళిన ముసలి రాజుగా మీసం మెలేస్తూ, సాలీడు గూళ్ళ నడుమ భయానకంగా కనిపిస్తున్నాడు. ఇలా మేకర్స్ స్పెషల్ విషెస్ ని అందించారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా టీజీ విశ్వ ప్రసాద్ అలాగే ఇషాన్ సక్సేనాలు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు