మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రమే “మాస్ జాతర”. మళ్ళీ క్రాక్ సినిమా తర్వాత తన నుంచి వస్తున్న ప్రాపర్ కమర్షియల్ సినిమాగా మంచి అంచనాలు దీనిపై ఉన్నాయి. ప్రామిసింగ్ గ్లింప్స్ సహా మంచి ఫస్ట్ సింగిల్ లో ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి రెడీ అవుతున్న సినిమాకి మాస్ మహారాజ ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు.
లేటెస్ట్ గా సినిమా డబ్బింగ్ ని ముగించేందుకు రవితేజ ఇప్పుడు డబ్బింగ్ స్టూడియోలో ఎంటర్ అయ్యారు. సో ఇవి అయ్యిపోతే ఇక అసలు మాస్ జాతర దగ్గరలోనే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగస్ట్ 27న సినిమా గ్రాండ్ గా విడుదలకి సిద్ధం అవుతుంది.