చిన్న సినిమాలు, మిడియమ్ రేంజ్ సినిమాలకు ఓటీటీలో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే నాని ‘వి’ రిలీజ్ కి ఈజీ అయింది. మేకర్స్ కి కూడా బాగానే కిట్టుబాటు అయింది. మరి పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి ? భారీ మార్కెట్ ఉన్న హీరోలకు ఓటీటీ పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదు. పోనీ ఆన్ లైన్ టికెట్ పెట్టి రిలీజ్ చేసుకుందామంటే ఫైరసీ బాధ ఒకటి. మొత్తానికి పెద్ద హీరోలు అందరూ థియేటర్స్ రిలీజ్ కోసం ఎదురుచూడటమేనా.
మరో పక్క కరోనా మహమ్మారి దెబ్బకు సమ్మర్ సీజన్ లాగే, ఇప్పుడు దసరా సీజన్ కూడా మిస్ అయ్యేలా కనిపిస్తోంది. అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ రిస్క్ చేసి థియేటర్స్ ఓపెన్ చేసినా జనం వస్తారా అనేది మరొక డౌట్. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’ మూవీ ఇలా చాల సినిమాలు థియేటర్స్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి.
కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే పెద్ద సినిమాల రిలీజ్ కి సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ముఖ్యంగా చిరంజీవి ‘ఆచార్య’, రజనీ మూవీ అలాగే ‘కె.జి.ఎఫ్ 2’ లాంటి భారీ యాక్షన్ సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఈ ఏడాది మొత్తం ఎదురుచూడాల్సిందేనెమో.