‘మంచి స్క్రిప్ట్ల మీద మరింత పెట్ట్టుబడి అవసరం ‘- లక్ష్మీ మంచు

‘మంచి స్క్రిప్ట్ల మీద మరింత పెట్ట్టుబడి అవసరం ‘- లక్ష్మీ మంచు

Published on Mar 5, 2013 1:05 AM IST

manchu-lakshmi

లక్ష్మీ మంచు టాలీవుడ్లో నటించడానికంటే ముందు నిర్మాత. ఆమె ‘ఝుమ్మంది నాదం’, ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రాలను నిర్మించింది. ఆమె తదుపరి సినిమా ‘గుండెల్లో గోదావరి’ ఎట్టకేలకు మార్చ్ 8న విడుదల అవుతుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతగా కెరీర్ ఎలా ఉంది అని అడగగా, దానికి ఆమె, “సినిమాలను నిర్మించడం అంత తేలికైన పని కాదు. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టడానికి ప్రతీ ఒక్కరూ వాళ్ళ సినిమాలో పెద్ద తారలు కావాలనుకుంటున్నారు. ఇప్పటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అదే ట్రెండ్. ముఖ్యంగా నిర్మాతలు కొన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు. అందులో తప్పు లేకపోయినా మంచి స్క్రిప్ట్ల మీద మరింత పెట్టుబడి పెట్టడం మంచిది. స్టార్ హీరోలు, హీరోయిన్లు లేనంత మాత్రాన ఆ సినిమాను అశ్రద్ధచేయటం మంచిది కాదని” చెప్పింది.

‘గుండెల్లో గోదావరి ‘ సినిమాలో లక్ష్మీ మంచు, తాప్సీ, ఆది మరియు సందీప్ కిషన్ నటిస్తున్నారు. కుమార్ నాగేంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ మంచు ఈ సినిమాను నిర్మించింది.

తాజా వార్తలు