రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి కీలక పాత్రల్లో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘విద్రోహి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వి ఎస్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి, ప్రమోషన్లపై యూనిట్ దృష్టి పెట్టింది.
ఇటీవల హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “విద్రోహి కథ వినిపించారు. చాలా బాగుంది. ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. విడుదల చేసిన పాట కూడా ఆకట్టుకుంది. రవి ప్రకాష్ మంచి ఆర్టిస్ట్. ఈ టీమ్‌కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను” అన్నారు.
IBM మెగా మ్యూజిక్ అధినేత పప్పుల కనక దుర్గారావు, దర్శకుడు వి ఎస్ వి, నిర్మాత విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు వినాయక్‌కి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రతి పాత్ర ప్రత్యేకంగా నిలిచేలా ‘విద్రోహి’ని కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని చిత్రబృందం వెల్లడించింది.