నా నమ్మకానికి ప్రతి రూపమే ‘విశ్వరూపం 2’ – కమల్ హాసన్

నా నమ్మకానికి ప్రతి రూపమే ‘విశ్వరూపం 2’ – కమల్ హాసన్

Published on Apr 2, 2014 1:05 PM IST

kamal-haasan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం రమేష్ అరవింద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఉత్తమ విలన్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కమల్ హాసన్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు. ‘ఉత్తమ విలన్’ సినిమా సెట్స్ పై ఉంటే ‘విశ్వరూపం 2’ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది.

ఇటీవలే ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ విశ్వరూపం సినిమా గురించి మాట్లాడుతూ ‘ టెక్నికల్ గా విశ్వరూపం 2 సినిమా సూపర్బ్ గా ఉంటుంది. అలాగే ఇందులో రొమాన్స్, సెంటిమెంట్ కూడా ఉంటుంది. విశ్వరూపం 2ని ఫ్రీక్వెల్, లేదా సీక్వెల్ అని రెండు విధాలుగా పిలవచ్చు. విశ్వరూపం స్క్రిప్ట్ అనుకున్నప్పుడే 2 పార్ట్స్ గా తీయాలనుకున్నాను. అది నా అహం కాదు, అది నా నమ్మకం అని’ అన్నాడు.

కోలీవుడ్ లో చాలా మంది విశ్వరూపం 2 పార్ట్స్ అవసరం లేదని చాలా మంది విమర్శించారు అందుకే ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ఈ సమ్మర్ చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు