మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే, ఈ మూవీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
కాగా, ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మార్చి నెలలో ఓ సాలిడ్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ డీల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ డీల్ కుదరగానే, చిత్ర రిలీజ్ డేట్ను అధికారికంగా వెల్లడించనున్నారట. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి నిజంగానే మార్చి నెలలో ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వస్తుందా అనేది వేచి చూడాలి