మంచు విష్ణు బాబు ప్రస్తుతం తన నూతన చిత్రం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కథానాయికగా హన్సిక నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “దేనికయినా రెడీ” అనే పేరుని పరిశీలుస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ హైదరాబాద్ పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు హోం బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో వినోదాత్మకమయిన అంశాలు మరియు యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. ఈ చిత్రం బాగా వస్తుందని నిర్మాణ సంస్థ ఆశిస్తున్నారు.