బాలయ్యకి అరుదైన గౌరవం!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు సాలిడ్ ప్రాజెక్ట్ “అఖండ 2” చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ అంతిమ దశలో ఉంచుకోగా ఇపుడు బాలయ్య ఓ అరుదైన గౌరవాన్ని అందుకోవడం బాలయ్య అభిమానులకి అలాగే నందమూరి అభిమానులకి ఆనందం కలిగించింది. బాలయ్య హీరోగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలయ్యకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.

అయితే ఈ రికార్డు అందుకున్న ఏకైక ఇండియన్ సినిమా హీరోగా బాలయ్య నిలవడం మరింత విశేషంగా నిలిచింది. దీనితో బాలయ్య అభిమానులు ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ ఘనతని ఆగస్ట్ 30న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ ని ఏర్పాటు చేసి జరుపుకోనున్నారట. ఇక ఇదిలా ఉండగా మరోపక్క బాలయ్య అభిమానులు అఖండ 2 రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు.

Exit mobile version