పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “ఓజి”. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇపుడు రెండో సాంగ్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక పవర్ ఫుల్ ఫస్ట్ సింగిల్ తర్వాత నెక్స్ట్ సాంగ్ గా మేకర్స్ ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
దీనితో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ గా సువ్వి సువ్వి అనే నెంబర్ ని అనౌన్స్ చేశారు. ఇక ఈ పాటని ఈ ఆగస్ట్ 27న వినాయక చవితి కానుకగా ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అయితే దీనిపై పోస్టర్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాలి. దాదాపు పవన్, ప్రియాంక లపై ఇలాంటి బ్యూటిఫుల్ పోస్టర్ ని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.
మరి సంగీత దర్శకుడు థమన్ ఈసారి ఎలాంటి నెంబర్ అందించాడో తెలియాలి అంటే ఈ కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 25న సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.