ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘కూలీ’ గ్యాంగ్.. సైమన్ మిస్

రీసెంట్ గా పాన్ ఇండియా లెవెల్లో వచ్చి టాక్ తో సంబంధం లేకుండా అదరగొట్టిన చిత్రమే “కూలీ”. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో 171వ సినిమాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం మంచి వసూళ్లు సాధించి తలైవర్ కెరీర్లో మరో భారీ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో రజినీకాంత్, ఉపేంద్ర, కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్ ఇంకా సౌబిన్ సాహిర్ లు సాలిడ్ పాత్రల్లో నటించగా ఈ అందరినీ ఒకే సినిమాలో చూసి ఫ్యాన్స్ కి కన్నులపండుగగా అనిపించింది. అయితే ఈ అందరినీ ఒకే ఫ్రేమ్ లో కలిపిన ఫ్రేమ్ ఒకటి సెట్స్ నుంచి మంచి ఫోటో మూమెంట్ గా మారింది.

దర్శకుడు లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్, రియల్ స్టార్ ఉపేంద్ర, మళయాళ నాచురల్ నటుడు సౌబిన్ ఇంకా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లు కలిసి కనిపించిన పిక్ మంచి స్పెషల్ గా మారింది. అయితే ఈ ఫ్రేమ్ లో మాత్రం సైమన్ కింగ్ నాగార్జున కూడా ఉండి ఉంటే మరింత నిండుగా ఉండేది అని చెప్పవచ్చు. కానీ తాను మిస్ అయ్యారు.

Exit mobile version