‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?

nagarjuna

అక్కినేని నాగార్జున ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం హీరో గానే కాకుండా పలు సాలిడ్ రోల్స్ చేస్తూ ఆ సినిమాల్లోనే ప్రధాన ఆకర్షణగా తాను నిలుస్తున్నారు. ఇలా రీసెంట్ గా కుబేర సినిమాలో ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు కూలీ సినిమాతో సైమన్ గా అందరికీ షాకిచ్చారు. ఒక స్టైలిష్ అండ్ వైలెంట్ విలన్ గా అదరగొట్టిన కింగ్ నాగార్జున రీచ్ ఇపుడు తమిళ ఆడియెన్స్ లో పెరిగిందనే చెప్పాలి.

తన స్టైలిష్ మేకోవర్ ఇంకా నటన చూసి ఇంప్రెస్ అయ్యిన తమిళ ఆడియెన్స్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే నాగార్జున వింటేజ్ సాంగ్స్ మంచి వైరల్ గా మారాయి. దీనితో తమిళ మార్కెట్ లో మాత్రం కూలీ సినిమాతో తాను మంచి మార్క్ ని సెట్ చేసుకున్నారని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చే సినిమా దర్శకుడు కూడా తమిళ దర్శకుడే కావడంతో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తెలుగు సహా తమిళ్ లో ఆ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

Exit mobile version