అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!

coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ చిత్రమే “కూలీ”. గట్టి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో డివైడ్ టాక్ తో కూడా 400 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని దుమ్ము లేపింది. ఇక తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా కూలీ చిత్రం ఇప్పుడు ఆల్ టైం రికార్డు గ్రాసర్ ని నిలిచినట్టు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.

అక్కడ 6.719 మిలియన్ డాలర్స్ గ్రాస్ తో ఆల్ టైం రికార్డు గ్రాసింగ్ తమిళ సినిమాగా మొదటి స్థానంలో నిలిచిందట. దీనితో ఒక్క నార్త్ అమెరికా మార్కెట్ నుంచే కూలీ 58 కోట్లకి పైగా గ్రాస్ అందుకొని అదరగొట్టింది. ఇక నెక్స్ట్ ఎక్కడ మార్క్ దగ్గరకి కూలీ రీచ్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ సాహిర్ తదితరులు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version