‘ఢీ’ వంటి బ్లాక్ బస్టర్ కామెడీ సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించుకున్న మంచు విష్ణు మళ్లీ ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. గతంలో ట్విట్టర్లోకి వచ్చిన ఆయన కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేయడం ఆపేసారు. ఇటీవలే @ItsVishnuManchu అనే ప్రొఫైల్ ఐడి ద్వారా ఆయన మళ్లీ ట్వీట్ చేయడం ప్రారంభించారు. ఆయన కొత్త ప్రొఫైల్ ద్వారా 50 వేలకి మందికి పైగా ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో ప్రముఖులందరూ ఆయనకి వెల్ కం చెప్పారు. విష్ణు ప్రస్తుతం ‘దేనికైనా రెడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు సరసన హన్సిక నటిస్తుంది.