విజయ్ సేతుపతి, కత్రినా ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడేనట ?

విజయ్ సేతుపతి, కత్రినా ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడేనట ?

Published on Feb 2, 2021 1:06 AM IST


తమిళ నటుడు విజయ్ సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ వరకు చేరుకుంది. ఆయనతో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. కొందరేమో ఆయన్ను తమ సినిమాల్లో ఒక ముఖ్యమైన పాత్రలోకి తీసుకోవాలని అనుకుంటుంటే ఇంకొందరు ఆయనతో ఫుల్ లెంగ్త్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి దర్శకుల్లో ‘అంధాదున్’ ఫిలిం మేకర్ శ్రీరామ్ రాఘవన్ ఒకరు.

ఈయన సేతుపతి హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేశారు. ఇందులో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయకిగా నటించనుంది. ఏప్రిల్ నెల నుండి పూణేలో ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. శ్రీరామ్ రాఘవన్ స్వయంగా నీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ గత సినిమాల తరహాలోనే ఈ చిత్రం కూడ కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం అని తెలుస్తోంది. ఇది పూర్తిగా హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సినిమా అని, ఒకేవేళ అయితే తమిళంలోకి డబ్ కాబడి ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు