వరల్డ్ వైడ్ గా “లైగర్” పంచ్ అప్పుడే.!

వరల్డ్ వైడ్ గా “లైగర్” పంచ్ అప్పుడే.!

Published on Feb 11, 2021 8:20 AM IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవర కొండ తన ముందు చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. మరి అలాగే లేటెస్ట్ గా స్టైలిష్ అండ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో ప్లాన్ చేసిన పాన్ ఇండియన్ చిత్రం “లైగర్”. మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

మరి ఇదే సమయంలో ఈ చిత్రం తాలూకా విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నామని అప్డేట్ కూడా ఇచ్చారు. మరి అలా చెప్పినట్టుగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు