ఆరోపణల పై ప్రశాంత్‌ వర్మ క్లారిటీ !

ఆరోపణల పై ప్రశాంత్‌ వర్మ క్లారిటీ !

Published on Nov 2, 2025 6:00 PM IST

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఆయన తాజాగా స్పందించారు. వ్యక్తిగతంగా తనని లక్ష్యంగా చేసుకుని తన పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ, అసలు మ్యాటర్ ఏమిటంటే.. ‘హను-మాన్’ తర్వాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస చేస్తానంటూ ప్రశాంత్‌ వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని, ఇప్పుడు చెయ్యడం లేదని ఛాంబర్‌లో నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ రూమర్స్ వచ్చాయి.

ఈ పుకార్ల నేపథ్యంలో తాజాగా ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇచ్చారు. పలు న్యూస్‌ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల వేదికగా తనపై వస్తున్న వార్తలన్నీ నిరాధార, అసత్యమైనవి అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు. తనపై ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిర్యాదు చేసినట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాను ఈ విధంగా స్పందించాల్సి వస్తోందని ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు