ఫైనల్ యాక్షన్ లో ‘మన శంకర వరప్రసాద్ గారు’!?

ఫైనల్ యాక్షన్ లో ‘మన శంకర వరప్రసాద్ గారు’!?

Published on Nov 2, 2025 7:07 PM IST

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలా జెట్ స్పీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ యాక్షన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.

దీని ప్రకారం మేకర్స్ మెగాస్టార్ పై ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇది కూడా పూర్తయితే సినిమా ఒక కొలిక్కి రావడమేనట. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు