హిస్టారిక్ ప్లానింగ్.. SSMB29 కోసం మొదటిసారి ఓ ఓటీటీలో కొత్తగా

హిస్టారిక్ ప్లానింగ్.. SSMB29 కోసం మొదటిసారి ఓ ఓటీటీలో కొత్తగా

Published on Nov 2, 2025 9:00 PM IST

SSMB29

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి అంతా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న అతి కొద్ది సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో చేస్తున్న భారీ సినిమా కూడా ఒకటి. కాగా ఈ సినిమా నుంచి ఈ నవంబర్ లోనే గ్రాండ్ ట్రీట్ రానున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ ఈవెంట్ కోసం ఒక హిస్టారికల్ ప్లానింగ్ ని సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది వరకు ఏవైనా ఈవెంట్ లు టీవీ, యూట్యూబ్ లలో లైవ్ ప్రసారం అయ్యేవి కానీ ఇప్పుడు మొట్టమొదటి సారిగా ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈవెంట్ ని స్ట్రీమ్ చేయనున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ గ్రాండ్ ఈవెంట్ ని జియో హాట్ స్టార్ వారు ఈ నవంబర్ 15 సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసారు. సో ఈ ఫస్ట్ ఎవర్ ఈవెంట్ ఎలా ఉంటుందో ఆరోజు వరకు ఆగి చూడాల్సిందే.

తాజా వార్తలు