మన టాలీవుడ్ రౌడీ హీరో సెన్సేషనల్ స్టార్ విహాయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “లైగర్”. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మంచి అంచనాలు నమోదు చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ ఈ మధ్యనే అనౌన్స్ చెయ్యగా దానికి విజయ్ అన్ని సినిమాల్లానే డిఫరెంట్ స్పందనే వచ్చింది.
అయితే మరి విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ హచిత్రం తాలూకా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ కు ఇప్పుడు సమయం కుదిరింది. ఆ రిలీజ్ డేట్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అన్నది మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది ఈ ఫిబ్రవరి 11న ఉదయం 8 గంటల 14 నిమిషాలకు రివీల్ చెయ్యబోతున్నట్టుగా పోస్టర్ తో తెలిపారు. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఏ డేట్ కు లాక్ చేస్తారో చూడాలి.