ఇటీవల కాలంలో మన టాలీవుడ్ నుంచి ఎన్ని చిత్రాల తాలూకా విడుదల తేదీలు బయటకు వచ్చాయో తెలిసిందే. మరి ఈ విడుదల తేదీలతోనే మళ్ళీ ఎప్పుడు ఏ సినిమాకు ఏ సినిమాకు రసవత్తర పోటీ ఉందనే అంశాలు హైలైట్ అయ్యాయి. అయితే మరికొన్ని సినిమాలు తాలూకా విడుదల తేదీలు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు సరైన సమాచారమే వినిపిస్తుంది.
మరి అలాంటి సమాచారం ప్రకారమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ హాట్ టాపిక్ అయ్యిన ప్రాజెక్ట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది తెలిసింది. మరి ఆ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లోనే విడుదల చేస్తారని టాక్ వచ్చింది.
అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ సరిగ్గా అదే సమయంలో ఈరోజే విడుదల తేదీ ప్రకటించిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం “లైగర్” రేస్ లోకి వచ్చింది. ఒకవేళ కనుక పవన్ చిత్రాన్ని కూడా అప్పుడే ప్రకటిస్తే రెండిటి విడుదలకు పెద్ద వ్యత్యాసం ఉండదని చెప్పాలి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సిందే. ఇక పవన్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.