ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విలక్షణ నటి కవిత ప్రస్తుతం చాలా బాధపడుతున్నారు. నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఆమె కన్తడికికారణం.. 100 సంవత్సరాల ఇండియన్ సినిమా సంబారాలకి పిలుపు రాకపోవడమే.
‘నేను ఇండస్ట్రీలో చాలా సీనియర్ నటిని. నా 35 ఏళ్ళ సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాను. కానీ నాకు మాత్రం ఇన్విటేషన్ రాలేదు. కానీ ఇప్పటివరకు ఒకటిరెండు సినిమాల్లో కనిపించిన వాళ్ళకి మాత్రం ఇన్విటేషన్ వచ్చింది. అలాగే ఇండస్ట్రీతో సంబంధం లేని వారికి కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి. కానీ ఆ ఆర్గనైజేషన్ నన్ను మాత్రం పిలవలేదు. అలాగే చాలా మంది సీనియర్ నటీనటులకి కూడా ఇన్విటేషన్ రాలేదు. చిత్రసీమ మాకిచ్చిన గౌరవం ఇదే’ అని ఆమె అన్నారు.
కవిత చెప్పినదానిలో పాయింట్ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలోని చాలా మంది సీనియర్ నటీనటులు కూడా తమకు ఇన్విటేషన్ రాలేదని బాధపడుతున్నారు.