పాపులర్ కమెడియన్ వేణు మాధవ్ ఫిట్స్ వల్ల ప్రమాదానికి గురయ్యారు. ప్రముఖ టీవీ చానల్ ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ షో జీన్స్ రియాలిటీ షో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే కొత్తపేటలోని ఒమ్ని హాస్పిటల్ లో చేర్పించారు. ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సంపత్ నంది డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న రచ్చ షూటింగ్ ఇబ్రహీంపట్నం లోని ఒక కాలేజీలో షూటింగ్ జరుగుతుండగా కూడా వేణుమాధవ్ ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఇంత టాలెంట్ ఉన్న నటుడు ఇలా ఆరోగ్య సమస్యలతో భాదపడుతుండటం ఆయన స్నేహితులని తోటి ఇండస్ట్రీ నటులను కలవరపరుస్తుంది. వేణుమాధవ్ మళ్లీ త్వరగా కోలుకవాలని ఆశిద్దాం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?