పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.
అయితే, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందనే వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హను రాఘవపూడి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడని తెలుస్తోంది. 1940ల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఒకవైపు మాత్రమే మనం చూడబోతున్నామట. అయితే, సీక్వెల్‌లో మాత్రం ప్రభాస్ పాత్రను పూర్తిగా చూపెట్టబోతున్నారట. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇక ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మరి నిజంగానే ఫౌజీ సీక్వెల్ గనక ఉంటే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయమని చెప్పాలి.


