‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఆయనే – అల్లు అరవింద్

‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఆయనే – అల్లు అరవింద్

Published on Oct 25, 2025 11:07 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా దీక్షిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను త్వరలో నిర్వహిస్తామని.. దానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వస్తాడని అల్లు అరవింద్ తెలిపారు.

దీంతో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు