మెగాస్టార్ చిరంజీవి లీగల్ టీమ్ నుండి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. సోషల్ మీడియా వేదికలపై ఆయన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ లేదా ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను దుర్వినియోగం చేయడం ఇకపై శిక్షార్హం కానుంది.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాజాగా ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్ లేదా ఏఐ రీ-క్రియేషన్లను అనుమతి లేకుండా వాడడం, మార్చడం లేదా ట్రోలింగ్ చేయడం చట్టవిరుద్ధమని చిరంజీవి లీగల్ టీమ్ స్పష్టంగా తెలిపింది.
ఇకపై ఎవరైనా మెగాస్టార్ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ రూపంలోనైనా కంటెంట్ సృష్టిస్తే లేదా పంచుకుంటే, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ ఆర్డర్‌లో పేర్కొన్నారు.



