పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశిఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ రావును తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి హైప్ ఉన్న ఈ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక నెక్స్ట్ సినిమా రిలీజ్ కోసం చర్చ మొదలైంది. ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది వరకే వచ్చే ఏడాదిలోనే ఫిబ్రవరి రిలీజ్ ఉండొచ్చు అని టాక్ వినిపించింది.
కానీ లేటెస్ట్ గా మార్చ్ లో రిలీజ్ ఉండొచ్చు అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి దీనిపై అసలు క్లారిటీ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే యుగానికి ఒక్కడు నటుడు పార్థిబన్ విలన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


