టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా లేకపోయి ఉంటే, ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది ఈ సినిమా. కానీ, కరోనా దెబ్బకు ఈ సినిమా మరో ఏడాదికి పోస్ట్ ఫోన్ అయింది. వెంకటేష్ ‘ఎఫ్ 3’ గురించి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం షూటింగ్ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని, ఇక తన కొత్త చిత్రాలను సంక్రాంతి అనంతరమే సెట్స్ పైకి వెళ్ళతాయని వెంకీ స్పష్టం చేశారు.
ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసినా.. షూట్ చేయాలంటే భారీ క్రూ కావాల్సి రావడంతో ఇక కరోనా తగ్గేవరకూ ఇప్పట్లో షూట్ ప్లాన్ చేయకూడదని అనిల్ ఫిక్స్ అయ్యారట. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. గతేడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది.
కాగా వెంకీ ఎఫ్ 3 కంటే ముందు ‘నారప్ప’ సినిమా పూర్తి చేయాల్సి రావడం, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తుండటం.. ఈ రెండు సినిమాలు కూడా కరోనా కారణంగా ఆగిపోయాయి. ఇవి పూర్తి అయ్యాకే ‘ఎఫ్ 3’ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.