ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయిన వెంకీ.

ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయిన వెంకీ.

Published on Apr 11, 2020 11:42 AM IST

ప్రాణాంతక కరోనా వైరస్ పై యుద్ధం చేస్తూ మా ప్రాణాలను, కుటుంబాలను కాపాడుతున్న వైద్యులు, పోలీసులకు నా సెల్యూట్, హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు, హీరో వెంకటేష్ వాళ్ళను రియల్ హీరోస్ మరియు సూపర్ హీరోస్ అని పొగడ్తలలో ముంచేశారు. దాదాపు నెల రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేష్ లాంటి స్టార్స్ పోలీసు సిబ్బందికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నేడు వెంకటేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇలా తన స్పందన తెలియజేశారు.

ప్రస్తుతం వెంకటేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నారప్ప అనే మూవీ చేస్తున్నారు. తమిళ హిట్ మూవీ అసురన్ కి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం, లాక్ డౌన్ అనంతరం నెక్స్ట్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ప్రియమణి ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు