సమీక్ష: ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు

సమీక్ష: ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు

Published on Sep 19, 2025 9:25 PM IST

 Daksha – The Deadly Conspiracy

విడుదల తేదీ : సెప్టెంబర్ 19, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు, చిత్ర శుక్లా, విశ్వంత్ దుడ్డంపూడి, జెమినీ సురేష్, సిద్దిఖీ
దర్శకుడు : వంశీ కృష్ణ మల్ల
నిర్మాతలు : మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి
సంగీత దర్శకుడు : అచ్చు రాజమణి
సినిమాటోగ్రాఫర్ : గోకుల్ బరతి
ఎడిటర్ : మధు రెడ్డి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి అలాగే చిత్ర శుక్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దక్ష’ – ది డెడ్లీ కాన్స్పిరసీ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

బీ ఫార్మ్స్ చైర్మన్ బలరాం వర్మ (సిద్దిఖ్కీ) ఒక పేరు మోసిన బిజినెస్ మెన్ కాగా తాను తన ల్యాబ్స్ లో మనుషులపై కొన్ని ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటాడు. ఇలా తన మనిషి ఒకరు ఊహించని విధంగా హైదరాబాద్ సిటీలో హత్య చేయబడతాడు. ఇక్కడ నుంచి ఈ హత్యలు కొనసాగుతాయి. ఎవరో గుర్తు తెలీని వ్యక్తి చేస్తున్న ఈ హత్యలు పోలీసులకి పెద్ద సవాలుగా మారితే రంగంలోకి సిఐ దక్ష (మంచు లక్ష్మి) దిగుతుంది. ఇక అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? వారు చేస్తున్న ప్రయోగాలు ఏంటి? మధ్యలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మిథిల (చిత్ర శుక్ల) ఎవరు? ఈ కేసుకి ఆమెకు సంబంధం ఏంటి? ఇంకో పక్క ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? వీరి అందరితో పాటుగా ఫేమస్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వామిత్ర (మోహన్ బాబు మంచు) పాత్ర ఏంటి అనేవి మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మంచు లక్ష్మి కొంచెం డిఫరెంట్ గా కనిపించారని చెప్పవచ్చు. తన నటన ఈజ్ సింపుల్ గా బాగున్నాయి. అలాగే ఆమెని మంచి స్టైలిష్ యాటిట్యూడ్ తో ప్రెజెంట్ చేయడం బాగుంది. ఇక వీటితో పాటుగా తనపై, మోహన్ బాబు లపై కనిపించే రెండు ట్విస్ట్ లు సినిమాలో డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే ఇద్దరి నడుమ ఫస్టాఫ్ లో ఫేస్ ఆఫ్ సీన్ ఇంకా క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీన్ మంచు ఫ్యాన్స్ కి నచ్చవచ్చు.

ఇక తన పాత్రలో మంచు మోహన్ బాబు తన వెర్సటాలిటీ, అనుభవంతో బాగా చేశారు. అలాగే మరో యువ నటుడు విశ్వంత్ బాగా చేసాడు. అలాగే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఎమోషనల్ గా కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి. ఇక వీరితో పాటుగా సముద్రఖని, సిద్దిఖీలు తమ పాత్రలలో బాగా చేశారు. ఇక చివరిగా ముఖ్య పాత్రలో నటించిన నటి చిత్ర శుక్లా తన రోల్ కి పూర్తి న్యాయం చేకూర్చింది. దర్శకుడు వంశీ కూడా చిన్నదే కానీ కీలక పాత్రలో నటించారు దానిలో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇటీవల కాలంలో మెడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లాంటివి చాలానే వచ్చాయి. వాటిలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. ఒక మెడిసన్, హ్యూమన్ ట్రైల్స్, అందులో హత్యలు రివెంజ్ లాంటివి సినిమాలో కనిపిస్తాయి. సో వాటితో ఈ చిత్రం అంత ఎగ్జైటింగ్ గా ఏమీ అనిపించదు.

ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే చాలా ఫ్లాట్ గా సాగుతుంది. నిడివి చాలా చిన్నదే అయినప్పటికీ అనవసర సన్నివేశాలు, లాజిక్ లు వంటివి లేకుండా రెగ్యులర్ గా సాగుతుంది. ఇక అలా వెళుతూ కథనం మరింత క్లిష్టంగా ఒకింత కన్ఫ్యుజింగ్ గా కూడా కొన్ని చోట్ల అనిపిస్తుంది.

అలాగే ఈ చిత్రాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా మంచి సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ చూపించే పరిస్థితులు ఏర్పరచే స్కోప్ ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా వినియోగించుకోలేదు. సెకండాఫ్ లో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒకొకటి వెంటవెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కొంచెం రష్డ్ గా అనిపిస్తాయి. అలాగే పలు లూప్ హోల్స్ లాంటివి లాజిక్ లేని సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్ ని సాంగ్ లేకుండా ముగించేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. దాదాపు నేపథ్యానికి కావాల్సిన సెటప్ ని డిజైన్ చేసుకున్నారు. అచ్చు సంగీతం కూడా ఓకే రేంజ్ లో ఉంది. గోకుల్ బరతి ఇచ్చిన కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. మధు రెడ్డి ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు వంశీ కృష్ణ మల్ల విషయానికి వస్తే.. డైమండ్ రత్నబాబు అందించిన కథకి తాను ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుంటే ఇంకా బెటర్ గా అనిపించి ఉండేది. కొన్ని ఎలిమెంట్స్ వరకు ఓకే కానీ తర్వాత కథనం నీరుగారినట్టు అనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి మెయిన్ లైన్ పైనే దృష్టి పెట్టి ఉంటే ఇంకా తక్కువ కథనం లోనే సినిమా పూర్తయి ఉండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోని మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి. సాధ్యమైనంత వరకు మంచు లక్ష్మి, మోహన్ బాబులు తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఊహాజనిత కథనం, పెద్దగా ఎగ్జైట్ చేయకుండా సాగే తీరు ఈ క్రైమ్ థ్రిల్లర్ ని డల్ గా మార్చేశాయి. సో ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు