‘వషీ యో వషీ’ అంటూ ఓమికి జపనీస్‌లో వార్నింగ్ ఇచ్చిన ఓజి

‘వషీ యో వషీ’ అంటూ ఓమికి జపనీస్‌లో వార్నింగ్ ఇచ్చిన ఓజి

Published on Sep 19, 2025 8:49 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతున్నారు. అయితే, ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ ట్రీట్ అందించారు.

‘వషీ యో వషీ’ అంటూ జపనీస్ భాషలో ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఓమి పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మికి సినిమాలో వార్నింగ్ ఇచ్చే సమయంలో ఈ డైలాగ్ కమ్ బీజీఎం రానుంది. ఇక జపనీస్‌లో పవన్ ఇచ్చే వార్నింగ్ తెలుగువారికి సైతం నచ్చేలా ఉండటం విశేషం.

ఈ సినిమాలో ఓమి పాత్రలో ఇమ్రాన్ హష్మి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేయగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు