కిష్కింధపురి ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ గట్టిగానే ఇచ్చాడు..!

కిష్కింధపురి ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ గట్టిగానే ఇచ్చాడు..!

Published on Sep 20, 2025 12:05 AM IST

టాలీవుడ్‌లో గతవారం రిలీజ్ అయిన చిత్రాల్లో హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేయగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యాయి.

దీంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ లభించింది. తొలి వారం ముగిసే సరికి ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తన గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా, ‘కిష్కింధపురి’ చిత్రంపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముందునుంచి చూపిస్తున్న కాన్ఫిడెన్స్ ఈ సినిమా కలెక్షన్స్‌తో నిజమైంది.

ఇక ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేకపోవడంతో కిష్కింధపురి చిత్రంతో పాటు మిరాయ్ తమ జోరును కొనసాగించే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు