సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా

సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా

Published on Sep 20, 2025 3:01 AM IST

Bhadrakaali Movie

విడుదల తేదీ : సెప్టెంబర్ 19, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు మరియు మాస్టర్ కేశవ్
దర్శకుడు : అరుణ్ ప్రభు
నిర్మాత : విజయ్ ఆంటోని
సంగీత దర్శకుడు : విజయ్ ఆంటోని
సినిమాటోగ్రాఫర్ : షెల్లీ కాలిస్ట్
ఎడిటర్ : రేమండ్ డెరిక్ క్రాస్టా

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తెలుగు ఆడియెన్స్ కి బాగా పరిచయం ఉన్న తమిళ నటుల్లో మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. వినూత్న సినిమాలతో అలరిస్తూ వస్తున్న విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రమే ‘భద్రకాళి’. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

సెక్రటేరియట్ లో ఒక మీడియేటర్ గా పని చేసే కిట్టు (విజయ్ ఆంటోనీ) తన ఇన్ఫ్లూయెన్స్ తో బికారిని కుబేరుడిగా చెయ్యగలడు ఒక ఎస్సై ని కానిస్టేబుల్ గా కూడా మార్చగలడు. ఇలా ఎంతోమంది పవర్ఫుల్ వ్యక్తులే కిట్టుకి ఏ పని అయితే ఆ పనికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకుంటూ వస్తారు. మరి ఇంతలా ప్రభావం కలిగి ఉన్న కిట్టు, దేశానికి ప్రధాని కావాలి అనుకుంటున్న ఒక రాజకీయ వ్యూహకర్త అభ్యంకర్ శంకర్ (సునీల్ కృపాలని)కి ఒక భారీ స్కామ్ కి లింక్ కావడం అనేది దేశాన్నే షేక్ చేస్తుంది. ఇలా అందరితో మంచి కనెక్షన్ లు ఉన్న కిట్టు ఎందుకు వారికి శత్రువుగా మారాడు? అసలు ఈ కిట్టు ఎవరు? అతను నిజంగానే అవినీతిపరుడా? తన ఎజెండా ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం తాలూకా ఆరంభమే చూసే ఆడియెన్ ని కట్టిపడేసే విధంగా మొదలవుతుంది. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తర్వాత కథనం అలా ఒకో లేయర్ లోకి వెళ్లే కొద్దీ మరింత గ్రిప్పింగ్ గా మారడం అనేది ఇంప్రెస్ చేస్తుంది. మంచి డైలాగ్స్ అదే రీతిలో ఉత్సుకత నెలకొల్పే ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ కథనాన్ని ఎంగేజింగ్ గా సాగించాయి.

అలాగే విజయ్ ఆంటోనీ నుంచి కథ,కథనాలు పరంగానే కాకుండా నటుడుగా కూడా ఈ సినిమాకి తాను మెప్పించారు అని చెప్పవచ్చు. తన పాత్రలోని పలు షేడ్స్ ని తాను బలంగా ప్రెజెంట్ చేశారు. అలాగే సెల్ మురుగన్, సునీల్ కృపాలనిలు తమ పాత్రల్లో సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించి తమ పాత్రలు రక్తి కట్టించారు.

అలాగే ఇక వీరితో పాటుగా ఇతర ముఖ్య నటులు తమ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తారు. ఇక వీటితో పాటుగా ఈ సినిమాలో పలు సన్నివేశాలు ఆడియెన్స్ లో మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాజకీయాల కోసం ఒక ముసలైన వివరించిన విధానం సన్నివేశం, సినిమాలో స్కామ్ రివీల్ చేసిన సన్నివేశం, కిట్టు పై కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ సినిమాలో మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో చాలా వరకు మంచి ఇంప్రెస్ చేసే అంశాలు ఉన్నప్పటికీ కొన్ని లోపాలు కూడా లేకపోలేవు. కథనం ఒకింత సీరియస్ గా ఉన్నప్పటికీ పలు సన్నివేశాలు వాటిలోని డీటైలింగ్ పరంగా మాత్రం మరింత అటెన్షన్ ఈ తరహా చిత్రాలకి అవసరం ఉంటుంది కానీ అది ఈ సినిమాలో మిస్ అయ్యింది.

అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సినిమాలో మరీ అంత ప్రభావవంతంగా కనిపించదు. వీటితో పాటుగా సినిమాలో కొన్ని బలమైన పాత్రలకి ఆ నటులు కూడా అంతగా సూట్ కాలేదు అనిపిస్తుంది. ఇంకా నటుడు త్రిప్తి రవీంద్ర పాత్ర పూర్తిగా డెవలప్ చేయకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా పలు బలహీనతలు ఈ సినిమాలో సూక్ష్మంగా కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ ఆంటోనీ సంగీతం కూడా అందించారు. తన స్కోర్ తో సినిమాలో మంచి ఇంట్రెస్ట్ కలిగించారు. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ ఈ చిత్రానికి బాగున్నాయి. ఇక దర్శకుడు అరుణ్ ప్రభు విషయానికి వస్తే.. తాను ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ఒక శంకర్ స్టైల్ లో డిజైన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ మంచి ఆసక్తికర కథనం, ఇంప్రెస్ చేసే స్క్రీన్ ప్లే తో డిజైన్ చేసుకోవడం బాగుంది. అలాగే చిన్న లోపాలు ఉన్నాయి కానీ ఓవరాల్ గా తన వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘భద్రకాళి’ చిత్రం అక్కడక్కడా ఆకట్టుకునే రివెంజ్ పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు. విజయ్ ఆంటోనీ షైన్ అవ్వగా దర్శకుడు సినిమాని నడిపించిన విధానం కూడా బానే ఉంది కానీ ఎక్కువ పాత్రలు, అక్కడక్కడా గాడి తప్పినట్టుగా అనిపించిన కథనం వంటి ఎలిమెంట్స్ నిరాశపరుస్తాయి. కానీ ఒక పొలిటికల్ థ్రిల్లర్ లాంటి సినిమాలు ఇష్టపడేవారిని ఈ సినిమా మెప్పిస్తుంది. మిగతా ఆడియెన్స్ అయితే తక్కువ అంచనాలు పెట్టుకుంటే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు