వరుణ్ సందేశ్ కొత్త సినిమా ‘ఈ వర్షం సాక్షిగా’ ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హరిప్రియ, వరుణ్ సందేశ్ తో రెండోసారి జంటగా నటిస్తోంది. ఓబుల్ సుబ్బారెడ్డీ – శ్రీనివాస్ చవకుల సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “నాకు ఈ చిత్రం చాలా నచ్చింది. నా జీవితానికీ, వర్షానికీ చాలా దగ్గర సంబంధం ఉందని నా నమ్మకం. నేను ఒరిస్సాలో పుట్టినప్పుడు, ఆ రోజు కూడా వర్షం పడిందంట. వర్షం నాకు అదృష్టసూచిక. ఈ సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుందని” అన్నాడు.
ఈ సినిమా నిర్మాతలు ఇదివరకు భోజ్ పురిలో కొన్ని చిత్రాలు తీసారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ మార్చ్ 21 వరకూ జరిగుతుంది. రెండో షెడ్యూల్ ఏప్రిల్ 12 నుండి మొదలుకానుంది. “ఇద్దరు శత్రువులు ఒకేచోట ఎలా అయితే కలిసుండలేరో, ఇద్దరు ప్రేమికులు కుడా అలాగే విడిపోయాక ఆనందంగా బతకలేరు అన్నదే ఈ చిత్ర కధాంశం” అని ఈ చిత్ర డైలాగ్ రైటర్ రామస్వామి చెప్పారు.