యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టిలు హీరో హీరోయిన్స్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం “ఉప్పెన”. ఈ ముగ్గురికీ డెబ్యూ ప్రాజెక్ట్ కాబడిన ఈ చిత్రంపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఇప్పుడు తెలిసిందే.
అన్ని అంశాలు కూడా బాగా కలిసి రావడంతో ఖచ్చితంగా ఓ డెబ్యూ మూవీగా దీనికి భారీ స్పందన రావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ అంచనాలను తప్పకుండా అందుకుంటామని మేకర్స్ కూడా చెబుతున్నారు. అలా లేటెస్ట్ గా దర్శకుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆడియెన్స్ కు మాత్రం ఒక గ్యారంటీ ఇస్తున్నాడు.
ఈ ఈ సినిమాలో లైన్ సింపుల్ గానే స్క్రీన్ ప్లే మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటాయని ఎండింగ్ అయితే చాలా ఎమోషనల్ గా కన్నీరు పెట్టించేలా ఉంటుందని ఈ విషయంలో నేను గ్యారంటీ ఇవ్వగలను అని తెలిపారు. మరి దర్శకుడు ఇంత స్ట్రాంగ్ గా చెబుతున్న ఈ అంశంలో సినిమాలో ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.