మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన లేటెస్ట్ డెబ్యూ చిత్రం “ఉప్పెన”. కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వారికి కూడా ఇదే తొలి చిత్రం అయినా ఎనలేని అంచనాలతో భారీ వసూళ్లనే కొల్లగొడుతుంది అనే ఎస్టిమేషన్ తో వచ్చింది. అయితే మరి ట్రేడ్ వర్గాలు వేసిన ఆ అంచనాలకు మించే ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు ఏ డెబ్యూ చిత్రానికి అలాగే ఏ హీరోకి రాని స్థాయి వసూళ్లు వచ్చాయి. మరి పి ఆర్ టీం చెప్పిన లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.43 కోట్ల షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఏరియాల వారీగా లెక్కలు చూస్తే..
నైజాం – రూ 3.08 కోట్లు
వైజాగ్ – రూ .1.43 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 0.98 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ .881 కోట్లు
కృష్ణ – రూ 0.62 కోట్లు
గుంటూరు – రూ. 0.65 కోట్లు
నెల్లూరు – రూ 0.35 కోట్లు
సీడెడ్ – రూ .1.35 కోట్లు
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో – రూ .9.3 కోట్లు షేర్
ఓవర్సీస్ లో రూ 34 లక్షలు
కర్ణాటక రూ 52 రూపాయలు
తమిళనాడు రూ 16 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ 10 లక్షలు
మొత్తం డే 1 వరల్డ్ వైడ్ గా – రూ .10.43 కోట్లు షేర్ ను ఈ చిత్రం రాబట్టి అదరగొట్టింది. మొత్తానికి మాత్రం ఈ ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర ఉప్పొంగింది అని చెప్పాలి.