మే లో రాబోతున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా


మంచు మనోజ్, బాల కృష్ణ లు ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం మే లో విడుధలవటానికి సిద్దమవుతుంది. చిత్రం తొంబై శాతం పూర్తయ్యింది. ఈ నెల మొదట్లోనే ఈ చిత్ర క్లైమాక్స్ పూర్తయ్యింది తరువాత ఈ చిత్ర బృందం కేరళ కు పాట చిత్రీకరణ నిమిత్తం వెళ్ళారు. లక్ష్మి మంచు ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించనున్నారు బాలకృష్ణ సరసన పంచి బోర కనిపించబోతున్నారు. శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మిస్తుంది. బాబో శశి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళం లో ఒకేసారి విడుదల కానుంది. కన్నడ లో రీమేక్ చెయ్యడానికి కన్నడ అగ్ర తారలతో చర్చలు జరుపుతున్నారు.

Exit mobile version