ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. ఇప్పుడు అభిమానులు ఈ చిత్రం టీజర్ కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ భారీ చిత్రం విషయంలో మొదట నుంచి కూడా చాలా కాలం వరకు మిస్టరీగా కొనసాగుతూ వచ్చిన అంశం ఏదన్నా ఉంది అంటే అది సంగీతం విషయం లోనే అని చెప్పాలి. అసలు ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారో అని అభిమానుల్లో కొంత కాలం మంచి టాపికే నడిచింది.
కానీ ఫైనల్ గా ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నాడని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ చిత్రం తాలూకా మ్యూజిక్ ఆల్బమ్ రెండు వెర్షన్స్ గా డిజైన్ చేశారట. మన దక్షిణాది అన్ని భాషల్లోనూ జస్టిన్ సంగీతం అందివ్వగా హిందీ వెర్షన్ కు గాను బాలీవుడ్ ఫేమ్ మిథున్ సంగీతం అందించాడట. దీనితో నార్త్ కి ఒకరు సౌత్ కి ఒకరు ఈ సినిమాకు పని చేసారని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా సంగీతంపై మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమాలో పాటలు ఎలా ఉంటాయో చూడాలి.