ట్విస్ట్.. ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా!?

ట్విస్ట్.. ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా!?

Published on Jun 3, 2025 8:59 PM IST

గత కొన్నేళ్ల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే “హరిహర వీరమల్లు”. ఐదేళ్లు పాటుగా ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఈ ఐదేళ్లలో ఎన్నో డేట్స్ మార్చుకుంది. అయితే ఎట్టకేలకి ఒక ఫైన డేట్ ని ఫిక్స్ చేసేసుకుని రాబోతుంది అనుకున్న ఈ చిత్రం జూన్ 12కి లాక్ అయ్యింది. అయితే ఇది మాత్రం కన్ఫర్మ్ డేట్ అని ఫ్యాన్స్ బలంగా నమ్మారు.

కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టు అంత బలంగా నమ్మిన ఈ డేట్ లో కూడా సినిమా రాదు అనే టాక్ ఇపుడు అంతే బలంగా వినిపిస్తుంది. సినిమాకి ఇంకా సీజీ పనులు కంప్లీట్ కావాల్సి ఉండగా ఇంత తక్కువ సమయంలో సాధ్య పడకపోవచ్చు అని అందుకే మళ్ళీ వాయిదా పడినట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అయితే కొత్త డేట్ ఏంటి అనేది చూస్తే దాదాపు ఈ జూన్ ఆఖరులో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వినికిడి. మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు