ట్విస్ట్.. ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ కి కొత్త వేదిక!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన భారీ హిస్టారికల్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి నుంచీ మేకర్స్ తిరుపతి వేదికగా భారీ ప్రీ రిలీజ్ కి జరపాలని చూసిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనితో ప్రీ రిలీజ్ వేదిక తిరుపతి నుంచి విశాఖపట్నం కి మార్చినట్టు లేటెస్ట్ న్యూస్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహించిన ఈ సినిమా జూలై 24న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

Exit mobile version