అనీల్ రావిపూడి సినిమాలో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ రోల్..!?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ఈ షూట్ నుంచి వస్తున్నా చిన్న చిన్న లీక్స్ మెగాస్టార్ లుక్స్ అలాగే సాలిడ్ ప్రమోషన్స్ లాంటివి మరింత హైప్ ని జెనరేట్ చేస్తున్నాయి.

ఇక వీటిని పక్కన పెడితే అనీల్ రావిపూడి సినిమాలో మెగాస్టార్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నారో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. దీని ప్రకారం మెగాస్టార్ ఒక డ్రిల్ మాస్టర్ గా కనిపించనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో చిరు చేసే కామెడీ టైమింగ్ గాని తన పెర్ఫామెన్స్ లు మంచి హైలైట్ గా కనిపిస్తాయట. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

Exit mobile version