‘అవతార్’, ‘ఇంటర్ స్టెల్లార్’ లలా ‘బాహుబలి’కి ఆ ఛాన్స్!

ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ లు అనేది ఇపుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో ఉన్న మాటే. మన దగ్గర కూడా ఒకప్పుడు రీరిలీజ్ లు ఉండేవి కానీ కాకపోతే ఇప్పుడు పాత ప్రింట్స్ ని కొత్తగా రీమాస్టర్ చేయడం ఒకటే జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో సినిమాలు రీరిలీజ్ కి వచ్చాయి. మరి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలకి మాత్రమే ఒక ప్రత్యేక ఆదరణ ఉంటుంది.

అలాంటి ఆదరణ కావాలి అంటే ఆ సినిమాలు ఏదో గొప్పగానే సాధించి ఉండాలి. మరి అలాంటి కొన్ని ఐకానిక్ రీరిలీజ్ సినిమాల లిస్ట్ లో మన ఇండియన్ సినిమా దగ్గర ‘బాహుబలి’ ఖచ్చితంగా నిలిచేలా ఉందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఒక టైటానిక్, అవతార్ 1, ఇంటర్ స్టెల్లార్ లాంటి భారీ సినిమాలకి సెన్సేషనల్ రెస్పాన్స్ యూనానిమస్ గా వచ్చింది.

కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ అనే కాకుండా అందరూ ఈ సినిమాలని రీరిలీజ్ లలో కూడా ఎంతో ఆదరించి భారీ వసూళ్లు అందించారు. మరి ఇదే తరహాలో మన ఇండియన్ సినిమా నుంచి బాహుబలి రీరిలీజ్ కి ఆ మూమెంటం కనిపిస్తుంది. ఏ రీరిలీజ్ కి కూడా నమోదు కానీ ఇంట్రెస్ట్స్ బాహుబలి ది ఎపిక్ కి కనిపిస్తుంది.

పైగా పాన్ ఇండియా లెవెల్లో ఈ రీరిలీజ్ వస్తుండడంతో ఇప్పుడు వరకు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డ్స్ ఈ సినిమా తుడిచేసి కొత్త వసూళ్ళని సెట్ చేసేలా కనిపిస్తుంది. దీనితో మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి అంటే ఎందుకు అంత ప్రత్యేకం అనేది నిరూపించే సమయం తిరిగి రాబోతుంది అని చెప్పవచ్చు.

సో రీరిలీజ్ ల విషయంలో కూడా అలాంటి ఐకానిక్ సినిమాలతో పాటుగా బాహుబలి రీరిలీజ్ కి కూడా ఒక కొత్త అధ్యాయం లిఖించబడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ భారీ సినిమాని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలిగా కనిపించారు. ఈ అవైటెడ్ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version