స్ట్రాంగ్ బజ్: ‘అఖండ 2’ నుంచి మరో బిగ్ ట్రీట్!

నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా చేసిన సినిమాలు వరుస హిట్స్ గా నిలిచి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇలా తన డబుల్ హ్యాట్రిక్ లో భాగంగా వస్తున్న మరో అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ మాస్ డివోషనల్ యాక్షన్ డ్రామా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గానే టీజర్ తో మంచి ట్రీట్ మేకర్స్ అందించారు.

కానీ లేటెస్ట్ గా మరో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం మేకర్స్ మరో బిగ్ ట్రీట్ గా ఇంకో టీజర్ ని కూడా వదలబోతున్నట్టుగా గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి రీసెంట్ గానే థియేట్రికల్ రిలీజ్ పై పలు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి వాటికి కూడా చెక్ పెట్టే విధంగా ఈ కొత్త టీజర్ ని ప్లాన్ చేస్తున్నారు కావచ్చు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version